అసలీ రక్షాబంధనం అంటే ఏమిటో తెలుసుకోవాలని, ధర్మరాజు, శ్రీకృష్ణపరమాత్మను అడిగాడట. అప్పుడుకృష్ణుడు, పూర్ణ దేవాసురయుద్ధం ఫచోరంగా జరిగినప్పుడు,ఇంద్రుడుపరాజితుడై, సహచరులతో అమరావతిలో తలదాచుకొన్నాడు. దానితో దానవరాజు త్రిలోకాలనూ తనఅధీనంలోకి తెచ్చుకోగాదేవపూజలు మూలపడ్డాయి.పూజలు లేకపోవటంతో, సురపతి బలమూ సన్నగిల్లింది. అప్పుడు అమరావతిల్లోని ఇంద్రునిమీదికి, మళ్లీరాక్షసులు దండెత్తివచ్చారు
దేవగురువైన బృహస్పతివద్దకు
శచీపతి సలహాకోసం పోగా, ఆయన యుద్దం చేయమన్నాడు. ఇంతలో ఇంద్రాణి, తనభర్త అయిన సురేంద్రునికి
రక్షకట్టి, విజేతవు కమ్మని పంపించింది. ఆవిధంగానే శక్రుడు, దానవులను గెలిచి, తిరిగి
స్వర్గంలోకి వేశించాడు. ఆ రక్షప్రభావం ఏడాదిపాటు వుంటుందనీ, ఆపైన అతన్ని తాము గెలువవచ్చనీ,
శుక్రాచార్యుడుదుఃఖితులైన నవులను ఓదార్చాడు.
కథవిన్న యుధిష్టిరుడు,
ఆరక్షనుఎలా కట్టుకోవాలని అడిగాడు.దానికి కృష్ణుడు,
"ధర్మరాజా! శ్రావణపూర్ణిమనాడు ఉదయం ఉపాకర్మ,తర్పణాదులు
నిర్వహించి మధ్యాహ్నం, రక్షవున్న పొట్టాన్ని పట్టవస్త్రల్లోక్షానీ, ఇత్తరవస్త్రాలతో
కానీ - సిద్దంచేయాలి. ఇంటిమధ్య అలంకరించి పీఠంమీద రక్షనుపెట్టి, పూజించి, పురోహితునితో
కట్టించుకోవాలి. 'ఓరక్షాబంధనమా, నీవు మహాబలిఅయిన దానవేంద్రుణ్ని కట్టేశావు. కనుక నిన్ను
నేను నారక్షకోసం కట్టుకొంటున్నాను' అనిచెప్పుకుంటూ కట్టించుకోవాలి. ఇట్లా రక్షధను కట్టించుకొనేవారు
ఏడాదివరకూ సుఖంగా వుంటారు" అనిచెప్పాడు.
0 comments:
Post a Comment