Vayusena Astram Druv


వాయుసేన అస్త్రం ‘ధ్రువ్‌’.

పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం అనూహ్యంగా నిర్వహించిన సర్జికల్‌ సైట్రిక్స్‌లో ధ్రువ్‌ యుద్ధ హెలికాప్టర్‌ కీలకపాత్ర పోషించింది. ! శత్రు రాడార్లకు చిక్కకుండా తక్కువ ఎత్తులో ప్రయాణించి.. సైనికులను తీసుకెళ్లి, తీసుకువచ్చాయి. ఈ అత్యంత అత్యాధునిక హెలికాప్టర్‌లను స్వదేశీ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్ఏఎల్‌) తయారుచేసింది. అతి తక్కువ బరువులో ఉండే ఈ యుద్ధ హెలికాప్టర్‌లను త్రివిధ దళాలు, కోస్ట్‌గార్డు దళాల కోసం రూపొందించింది. వీటి గురించి కొన్ని ఆసక్తికర అంశాలు.. 




ఇది గంటకు 282 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. 
660 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. పొడవు 16 మీటర్లు.
 
ఇందులో జీపీఎస్‌, డాప్లర్‌ నేవిగేషన వ్యవస్థ, గాలి వేగాన్ని తెలిపే ఇండికేటర్లు, ఎత్తును తెలిపే పరికరాలు, స్వయంగా దిశను నిర్దేశించగల వ్యవస్థ ఉన్నాయి.
 


ఇన్ఫ్రారెడ్‌ జామర్లు, క్షిపణులను గుర్తించే డిటెక్టర్లు, రాడార్లు వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం దీని సొంతం! 
ఉదయం, రాత్రి సమయాల్లోనూ దాడులు చేసేందుకేగాక సైనికులు, వస్తువులను తరలించేందుకూ ఉపయోగించవచ్చు.
 
ఇందులో గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల నాలుగు క్షిపణులను తీసుకెళ్లవచ్చు.
 
12 నుంచి 14 మంది ప్రయాణించవచ్చు. సంప్రదాయ యుద్ధ హెలికాప్టర్‌లానే ఉన్నా.. వాటి కంటే రెండు రెట్లు తక్కువ బరువుతో ఉంటాయి.
 


వీటిలో శక్తిమంతమైన ఇంజనను నిక్షిప్తం చేశారు. ప్రమాదాల వేళ ఇంధన ట్యాంకులు వాటంతట అవే మూసుకుపోతాయి. ఇందులో 1400 లీటర్ల ఇంధనం నింపవచ్చు. 


 
జమ్ముకశ్మీర్‌లోని ఎత్తయిన ప్రాంతాల్లోనూ, తక్కువ ఉష్ణోగ్రతలు గల ప్రాంతాల్లోనూ దీనిని ఉపయోగించేందుకు 2007 ఫిబ్రవరిలో అనుమతి లభించింది.

About vasu

0 comments:

Post a Comment