* ఫ్రిజ్‌లో కోసిన ఉల్లిపాయముక్కలు, కూరగాయలు, అల్లంవెల్లుల్లి, పచ్చళ్లసీసాలు... ఇలా ఎన్నో పెడతాం. కూరగాయలు కుళ్లిపోయినా, సీసాల మూతలు ఊడిపోయినా ఫ్రిజ్ నుంచి దుర్వాసన వస్తుంది. దీన్ని తగ్గించాలంటే అక్కడక్కడా నిమ్మ ముక్కలు పెట్టి చూడండి. నిమ్మరసంలో దూది ఉండను ముంచి ఫ్రిజ్‌లో పెట్టినా దుర్వాసన తగ్గిపోతుంది.
* దుస్తుల మీద పడిన కాఫీ, కెచప్, కూరల మరకలను కూడా నిమ్మరసంతో తొలగించవచ్చు. మరకలపై నిమ్మరసం రాసి, కొద్దిగా ఉప్పు చల్లి కాసేపు పక్కన పెట్టాలి. ఆ తరువాత డిటర్జెంట్‌తో ఉతికితే మరకలు మాయం.
* కోసిన యాపిల్ ముక్కలపై నిమ్మరసం చల్లడం వల్ల అవి రంగు మారకుండా, ఎక్కువసేపు తాజాగా ఉంటాయి.
* కప్పు నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి ఆ నీటిని మాడుకు పట్టించాలి. పది నిమిషాలాగి యాంటీ డ్యాండ్రఫ్ షాంపూతో తలను శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే చుండ్రు సమస్య చాలామటుకూ అదుపులోకి వస్తుంది.
* చేతిగోళ్లు నిర్జీవంగా కనిపిస్తున్నాయా... కప్పు గోరువెచ్చటి నీటిలో అర చెక్క నిమ్మరసం పిండి చేతిగోళ్లు అందులో మునిగేలా పెట్టండి. ఐదు నిమిషాల తరువాత... గోళ్లు తెల్లగా, ఆరోగ్యంగా మారతాయి.
0 comments:
Post a Comment