మాంసకృతులు: అలసందల గురించి అందరికీ తెలుసు కానీ.. వీటిలో మాంసకృతులు ఎక్కువగా ఉంటాయని
కొందరికే తెలుసు. ఇవి తక్కువ ఖర్చులో లభించినా.. ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్
ఎక్కువగా ఉంటాయి. శాకాహారులకు ఇది మంచి ప్రోటీన్ ఫుడ్. చేపనూనేలో ఉండే యాసిడ్స్ అలసందల్లో
లభిస్తాయి.
గుండె జబ్బు: గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవాళ్లు అలసందలను
డైట్‌లో చేర్చుకుంటే మంచిది. ఇవి బ్లడ్‌లో కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. దీనివల్ల
గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
మధుమేహం: మధుమేహంతో బాధపడే వాళ్లకు అలసందలు మంచి ఆహారం.
వీటిని తరచుగా తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. మధుమేహంతో బాధపడే వారికి లోగ్లిజమిక్
ఇండెక్స్ కలిగిన అలసందలు చాలా ఆరోగ్యకరం. ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్‌ను నార్మల్‌గా ఉంచేందుకు
ఉపయోగపడతాయి.
మలబద్ధకం: మలబద్ధకంతో బాధపడేవాళ్లకు ఇది చక్కటి పరిష్కారం.
అలసందలను నానబెట్టి గుగ్గిళ్ల రూపంలో తీసుకుంటే.. మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు.
ఫైబర్: అలసందల్లో జీర్ణక్రియను మెరుగుపరిచే ఫైబర్ పుష్కలంగా
ఉంటుంది. వీటిని రోజుకో కప్పు తీసుకోవడం ద్వారా ఆకలి వేయదు. పొట్ట నిండినట్లు ఉంటుంది.
అలాగే జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహాయపడతాయి.
యాంటీ ఆక్సిడెంట్స్: అలసందల్లో యాంటీ ఆక్సిడెంట్స్,
విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. వైరల్ ఫీవర్, జలుబు, ఇన్ఫెక్షన్లను దరిచేరనివ్వవు.
క్యాల్షియం: అలసందల్లో ఇనుము, మెగ్నీషియం, క్యాల్షియం,
ఫాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలతో పాటు థయామిన్, రైబోఫ్లెవిన్, నియాసిన్ వంటి విటమిన్స్
పుష్కలంగా ఉంటాయి.
ఒత్తిడి: అలసందలను ఎలా వండినా.. ఇష్టంగా తినాలనిపిస్తుంది.
అయితే వీటిని తినడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఏ కారణంగా కంటిచూపు
సమస్యలకు కూడా గుడ్ బై చెప్పవచ్చు. అలాగే కిడ్నీ సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
0 comments:
Post a Comment