మనిషిని చూడగానే ముందుగా ఆకట్టుకునేది బట్టలే. దుస్తుల విషయంలో జీన్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. చాలా మంది దీన్ని విరివిగా వాడుతున్నారు. ముఖ్యంగా యువతులైతే జీన్స్ ధరించడం ఒక ఫ్యాషన్‌గా భావిస్తారు. అందులోనూ టైట్ జీన్స్ చాలా మంది ఎక్కువగా వాడుతున్నారు.
అయితే ఈ టైట్ జీన్స్ వాడకం ఎలా వచ్చిందంటే..
జీన్స్‌ను మహిళలు వాడటం మొదలు పెట్టినప్పుడు కొన్ని అమెరికన్, యూరప్ కంపెనీలు వాళ్ల అభిప్రాయాలను తెలుసుకునేందుకు సర్వే చేశాయి. డిజైనర్స్, టెక్నీషియన్స్, మర్చెంట్స్ ఇందులో పాల్గొన్నారు. మహిళల వద్దకు వెళ్లి వాళ్లకు జీన్స్ ఎలా ఉంటే ఇష్టమని అడిగి పాయింట్లను నోట్ చేసుకున్నారు. ఒక్కోక్కరి దగ్గర కనీసం అరగంటపాటు గడిపి లోతుగా పరిశీలించేవారు.
ముందుగానే రాసుకున్న పలు ప్రశ్నలను అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ సర్వేలో జీన్స్ టైట్‌గా ఉండాలనే ఎక్కువ మంది యువతులు కోరారు. తమ శరీర ఆకృతికి సరిగ్గా సరిపోయే కొలతలుండి గ్లవ్స్ మాదిరిగా ఉండే జీన్స్ కావాలని చెప్పారు. దీంతో అన్నీ బేరీజు వేసుకున్న జీన్స్ కంపెనీలు టైట్ జీన్స్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చాయి. దీంతో వాటికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. వెస్ట్రన్ కల్చర్‌ను ఇష్టపడిన ఇండియన్ లేడీస్ టైట్ జీన్స్‌ను కూడా స్వీకరించారు. దీంతో భారత్‌లో కూడా అది బాగా పాపులర్ అయ్యింది. ఇప్పటికీ పలు దుస్తుల కంపెనీలు ఇలాంటి సర్వేలనే ఆశ్రయించి తమ బిజినెస్‌ను పెంచుకుంటున్నాయి....
0 comments:
Post a Comment