ఆరోగ్యానికి బాదంపప్పు ఎంతో మంచిది. ముఖ్యంగా నానబెట్టిన బాదంపప్పు అయితే ఆరోగ్యానికి మరింత మేలు జరుగుతుందని తాజా అధ్యయనాలు తేల్చాయి. బాదంలోని విటమిన్ E, ఫైబర్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు ప్రొటీన్లు బాదంపప్పులో పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల్ని బలంగా ఉంచుతాయి. అంతేగాకుండా చక్కటి రక్త ప్రసరణకు, బ్లడ్ షుగర్ నియంత్రణకు, కండరాలు, నరాల పనితీరు సవ్యంగా సాగేందుకు బాదం ఎంతో మేలు చేస్తుంది.
బాదం పప్పును నీళ్లలో నానబెట్టడం ఎందుకంటే..
బాదంపప్పుపై ఉండే పొట్టులో ఒకరకమైన బయో మాలిక్యూల్ టానిన్ ఉంటుంది. ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. అదేకనుక, బాదం పప్పును నానబెడితే వాటిపై పొట్టు ఊడిపోతుంది. తద్వారా జీర్ణక్రియ సమస్యల నుంచి తప్పించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఒక గుప్పెడు బాదం పప్పును, అరకప్పు నీటిలో సుమారు ఎనిమిది గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత నీటిని ఒంచి వేసి, బాదంపప్పుపై పొట్టును తొలగించాలి. ఇలా బాదం పప్పును నానబెట్టి తీసుకోవడం ద్వారా అధిక బరువును తగ్గించుకోవచ్చు. గుండెను పదిలం చేసుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
0 comments:
Post a Comment