కాకరకాయను తీసుకోవడం వల్ల
రక్తపోటు, హైబీపీ, అలర్జీలు దూరం చేసుకోవచ్చు. అలాగే చాలామంది
బాధపడుతున్నడయాబెటిస్‌కి చెక్ పెట్టవచ్చు. కాకరకాయను అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల
రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. కాబట్టి డయాబెటిస్ పేషంట్స్ డైట్‌లో
కాకరకాయను ఎక్కువగా ఉపయోగించడం మంచిది.
కాకరకాయలో ఫొలేట్, మెగ్నీషియం,
పొటాషియం మరియు జింక్ పుష్కలంగా ఉంటాయి. ఔషధగుణాలున్న కాకరను తినడం వల్ల
జీర్ణశక్తి కూడా మెరుగవుతుంది.
కాకరకాయలో కడుపులో నులి పురుగులను నాశనం చేసే గుణం కూడా ఉంది. అలాగే ఐరన్
ఎక్కువగా ఉంటుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి రోగనిరోధక శక్తి కూడా
పెరుగుతుంది. అలాగే అలర్జీ, స్కిన్ ప్రాబ్లమ్స్ మరియు సొరియాసిస్ వంటి వ్యాధులను
కూడా నయం చేస్తుంది. కాబట్టి ఇకపై కాకరకాయ అంటే నిర్లక్ష్యం చేయకుండా కొంచెమైనా
తినడం అలవాటు చేసుకోండి.
0 comments:
Post a Comment