గుండె
వ్యాధులు: సోయాలో ఉండే ప్రొటీన్స్ తక్కువ కొవ్వు పదార్థాలు పొందేలా చేస్తాయి. అలాగే
సోయా ఉత్పత్తులు తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి.
ఎముకల బలానికి: సోయా ఫ్యామిలీకి చెందిన ఉత్పత్తుల్లో
ఫైటో ఈస్ర్టోజెన్స్ ఉంటాయి. ఇవి శరీరంలో క్యాల్షియం గ్రహించటాన్ని ఎక్కువ చేసి,
ఎముకల బలానికి సహాయపడతాయి. విటమిన్ డి, క్యాల్షియం ఎక్కువగా ఉండే సోయా ఉత్పత్తులు
రోజూ వాడటం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి.
మధుమేహానికి: ఆరోగ్యకరమైన ఫైబర్ ఉన్న సోయా ఆహారాలు తీసుకోవటం
వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. కాబట్టి మధుమేహంతో బాధపడేవాళ్లు సోయా
ఉత్పత్తులు తీసుకోవడం చాలా అవసరం.
రోగనిరోధక శక్తి: సోయాలో సాపోనిన్‌లు ఉంటాయి. ఇవి శరీరంలో
కొవ్వు పదార్థాలు చేరకుండా కాపాడతాయి. అలాగే సూక్ష్మజీవులను చంపి రోగనిరోధక
శక్తిని పెంచుతాయి
0 comments:
Post a Comment