The Potential Health Benefits of Eating Cabbage


బరువు తగ్గడానికి: క్యాబేజీలో ఎక్కువ నీటి శాతం ఉంటుంది. కాబట్టి బరువు తగ్గడానికి ఇది ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. క్యాబేజీని జ్యూస్ లేదా సలాడ్ రూపంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. క్యాబేజీ ఫ్యాట్‌ని కరిగించడానికి బాగా సహాయపడుతుంది. 

అల్సర్: క్యాబేజీలో విటమిన్ C, విటమిన్ E ఉంటాయి. ఇవి కడుపులో ఇబ్బందిపెట్టే అల్సర్ తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. క్యాబేజ్ రసంలో యాంటీ అల్సర్ గుణాలు ఉంటాయి. 


కంటి ఆరోగ్యానికి: క్యాబేజీలో బీటా కెరోటిన్ కంటెంట్ ఉంటుంది. ఇది కళ్లలోపల వచ్చే మచ్చల నివారణకు సహాయపడుతుంది. కంటి శుక్లాలు రాకుండా కాపాడటంలోనూ క్యాబేజ్ బాగా పనిచేస్తుంది. 

అధిక రక్తపోటు: క్యాబేజ్ రక్తపోటుని కూడా కంట్రోల్ చేస్తుంది. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది బీపీని అదుపు చేయడానికి సహకరిస్తుంది.


About vasu

0 comments:

Post a Comment