Why Eat The Mango Fruit


కప్పు నిండా మామిడి ముక్కల్ని తింటే ప్రయోజనం ఏమిటి అని అనుకుంటున్నారా? 

ఒక కప్పు మామిడిలో  76 శాతం విటమిన్సి వుంటుంది. దీని ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఇక 25 శాతం విటమిన్ A వుంది. విటమిన్ A ద్వారా కంటికి మేలు చేసినట్లవుతుంది. 11 శాతం విటమిన్బీ2- మెదడులో ఉత్పత్తి అయ్యే హార్మోన్శాతాన్ని నియంత్రిస్తుంది. ఇంకా హృద్రోగవ్యాధులను నివారిస్తుంది.


ఇంకా 9 శాతం పీచు ఉంచుతుంది. ఇవి శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియాను ఉత్పత్తిచేస్తాయి. అలాగే ఒక కప్పు మామిడిలో 6 శాతం కాపర్, 7 శాతం పొటాషియం, 4 శాతం మెగ్నీషియం ఉంటుంది. అందుచేత విరివిగా వేసవిలో లభించే మామిడిని రోజూ ఓకప్పు తీసుకోవడం ద్వారా పైన చెప్పిన పోషకాలన్నీ శరీరానికి లభించినట్లవుతుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు.

About vasu

0 comments:

Post a Comment