అధిక కొలెస్ట్రాల్, షుగర్ సమస్యలతో అనేక మంది బాధపడుతున్నారు. వీటిని ఎప్పటికప్పుడు నియంత్రించకపోతే ఇతర అనారోగ్య సమస్యలు కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ సమస్య నుండి విముక్తి పొందాలంటే ఉసిరిని నిత్యం తీసుకోవడం వల్ల ఈ వ్యాధుల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.
విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే ఉసిరితో తయారు చేసిన జ్యూస్‌ను తాగితే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడంతోపాటు రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుకోవచ్చు.
అయితే ఇప్పుడు ఆ ఉసిరి జ్యూస్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
ముందుగా రెండు పెద్ద ఉసిరి కాయలను తీసుకుని వాటిలోని గింజల్ని తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని ఒక కప్పు నీటితో కలిపి మిక్సీలో గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని శుభ్రమైన గుడ్డతో వడకట్టాలి. దీంతో జ్యూస్ తయారవుతుంది. అందులో కొద్దిగా బ్లాక్ సాల్ట్, లేక కొంచెం తేనెను కలిపి తీసుకోవాలి. ఈ జ్యూస్‌ను క్రమంగా తీసుకుంటే రోగాల బారి నుండి బయటపడవచ్చు.
0 comments:
Post a Comment