అధిక శాతం మంది బాధపడుతున్న వ్యాధుల్లో హార్ట్
ఎటాక్ కూడా ఒకటి. అది ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో తెలియదు. కానీ ఒకసారి వస్తే
మాత్రం గుండెకు చాలా తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఈ క్రమంలో హార్ట్ ఎటాక్‌ల కారణంగా
ఏటా కొన్ని లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. ఒక్క అమెరికాలోనే ఏటా 6 లక్షల
మంది హార్ట్ ఎటాక్స్ కారణంగా మరణిస్తున్నారు. మరో 7.20 లక్షల మంది కొత్తగా
హార్ట్ ఎటాక్‌ల బారిన పడుతున్నారు. మొదటి సారి హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడే
వీలైనంత ఎక్కువ శ్రద్ధ వహిస్తే గుండెకు జరిగే నష్టాన్ని అధిగమించవచ్చని
వైద్యులు చెబుతున్నారు. కాగా ఒకసారి హార్ట్ ఎటాక్‌కు గురైన వారు మాత్రం ఇక ఎప్పటికీ
అప్రమత్తంగా ఉండాల్సిందేనని వారు అంటున్నారు. ఈ క్రమంలో హార్ట్ ఎటాక్‌లు
రాకుండా చూసేందుకు అధిక శాతం మంది మెడిసిన్స్ మీద ఆధార పడడం, నిత్యం వ్యాయామం
చేయడం, తగిన పౌష్టికాహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు వహిస్తున్నారు. అయితే
వాటన్నింటితోపాటు కయాన్ పెప్పర్ (Cayenne Pepper) అనే ఓ ప్రత్యేకమైన మిరపకాయ
పొడిని నిత్యం తీసుకుంటే హార్ట్ ఎటాక్ రాకుండా జాగ్రత్త పడవచ్చట. డాక్టర్
జాన్ క్రిస్టఫర్ అనే ఓ వైద్యుడు తన బృందంతో కలిసి చేసిన పరిశోధనల్లో తాజాగా
ఈ విషయం వెల్లడైంది.
కయాన్ పెప్పర్‌లో
క్యాప్సెయిసిన్ (Capsaicin) అనే ఓ రసాయనం ఉంటుంది. అది రక్తనాళాల్లో రక్తం గడ్డ
కట్టడం, కొవ్వు చేరడం వంటి ఏవైనా అడ్డంకులు ఉంటే వాటిని కరిగిస్తుంది. ఈ క్రమంలో
డాక్టర్ జాన్ క్రిస్టఫర్ పలువురు పేషెంట్లకు కయాన్ పెప్పర్‌తో తయారు చేసిన
టీని తరచూ ఇచ్చాడు. ఒక కప్పు వేడి నీటిలో కొద్దిగా కయాన్ పెప్పర్ పొడిని వేసి
టీలా మరిగించి పేషెంట్లకు ఆయన ఇచ్చాడు. దీంతో వారి రక్త నాళాల్లో ఉన్న
అడ్డంకులన్నీ తొలగిపోయాయి. డాక్టర్ జాన్ క్రిస్టఫరే స్వయంగా ఈ విషయాన్ని
వెల్లడించారు. అయితే ఈ విషయం వారికి ఎలా తెలిసిందంటే, హార్ట్ ఎటాక్స్ వంటివి వచ్చినప్పుడు
పేషెంట్లకు తాత్కాలిక ఉపశమనం లభించడం కోసం, గుండెకు జరిగే నష్టాన్ని
నివారించేందుకు పైన చెప్పిన క్యాప్సెయిసిన్ రసాయనం ఉండే పెయిన్ కిల్లర్స్‌ను
వారి చర్మంపై రుద్దేవారు. దీంతో ఆ రసాయనం గుండె పోటుకు వ్యతిరేకంగా పనిచేస్తుందని
వారికి అప్పుడే తెలిసింది. అలా ఆ రసాయనం వేటిలో ఉంటుందని పరిశోధన చేయగా, అది
కయాన్ పెప్పర్‌లో తగిన మోతాదులో ఉంటుందని తెలిసింది. దీంతో ఆ పెప్పర్‌ను మళ్లీ
ప్రయోగాత్మకంగా పరిశీలించి డాక్టర్ జాన్ క్రిస్టోఫర్ ఒక నిర్ణయానికి వచ్చారు.
ఆ పెప్పర్‌ను తరచూ వాడితే రక్త నాళాల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని, గుండె
పోటు రాదని, ఇప్పటికే గుండె పోటు వచ్చిన వారు కూడా దాన్ని వాడితే భవిష్యత్తులో
హార్ట్ సమస్యలు రాకుండా చూసుకోవచ్చని చివరకు ఆయన తెలిపారు...
0 comments:
Post a Comment