తక్కువ క్యాలరీ: ఒక కప్పు గ్రీన్ గ్రేప్స్‌లో 104 క్యాలరీలు ఉంటాయి. కాబట్టి రోజూ ఒక
కప్పు గ్రీన్ గ్రేప్స్ తీసుకోవడం వల్ల ఆకలి తగ్గించి, శరీరానికి కావాల్సిన క్యాలరీలు
అందిస్తుంది. అలాగే బరువు అదుపులో ఉండటానికి సహాయపడుతుంది.
ఇన్ఫెక్షన్స్: గ్రీన్ గ్రేప్స్‌లో ఉండే పోషకాలు ఇన్ఫెక్షన్స్,
ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే వాతావరణంలో మార్పుల కారణంగా వచ్చే అనారోగ్య సమస్యల నుంచి
ప్రొటెక్ట్ చేస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఇవి హార్ట్ ఎటాక్ రిస్క్‌ని
తగ్గిస్తాయి. అలాగే బ్లడ్ క్లాట్స్ నివారించి, ఇన్ల్ఫమేషన్ తగ్గిస్తాయి.
క్యాన్సర్: ఒక కప్పు గ్రీన్ గ్రేప్స్ తీసుకోవడం వల్ల
విటమిన్ C శరీరానికి కావాల్సిన స్థాయిలో అందుతుంది. అలాగే ఫ్రీ రాడికల్స్ నుంచి నివారించి
క్యాన్సర్ రిస్క్‌ని అరికడుతుంది.
ఎముకలు: గ్రీన్ గ్రేప్స్‌లో విటమిన్ C, K పుష్కలంగా
ఉంటాయి. విటమిన్ C ఇన్ఫెక్షన్స్, ఎముకలు, పళ్లు, చిగుళ్ల ఆరోగ్యానికి చాలా అవసరం. కాబట్టి
కేవలం ఆరంజ్ ద్వారానే కాకుండా గ్రీన్ గ్రేప్స్ ద్వారా విటమిన్ C పొందవచ్చు.
కార్బోహైడ్రేట్స్: రోజువారీ డైట్‌లో కార్బోహైడ్రేట్స్
చాలా అవసరం. వీటి ద్వారా కార్బోహైడ్రేట్స్, ఫైబర్, విటమిన్స్ మరియు మినరల్స్ ఈజీగా
పొందవచ్చు. అంతేకాదు గ్రీన్ గ్రేప్స్‌లో హెల్తీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఒక కప్పు
గ్రీన్ గ్రేప్స్‌లో 1.4 గ్రాముల ఫైబర్ లభిస్తుంది.
0 comments:
Post a Comment